Sydney: సిడ్నీ నగరం పూల సందడి.. అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
జపాన్లో చెర్రీ బ్లాసమ్ పూలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయో.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో విరబూసే జకరాండా పూలు కూడా అంతే ప్రత్యేకం. వసంతకాలం వచ్చిందంటే చాలు.. నగరంలోని రోడ్లు, పార్కులు, వీధులన్నీ ఊదా రంగు పూలతో నిండిపోతాయి. చెట్ల కొమ్మలపై గుత్తులుగా పూసే ఈ పూలు నగరానికి కొత్త అందాన్ని తీసుకొస్తాయి. ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ ఔత్సాహికులు, పర్యాటకులకు ఈ దృశ్యం ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఆస్ట్రేలియాలో వసంతకాలం ప్రకృతి అందాలను విరబూయిస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ మధ్య నుంచి సిడ్నీ నగరంలో జకరాండా...