Devotional: నవగ్రహాల ప్రాముఖ్యత.. పూజిస్తే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు!
సనాతన ధర్మంలో నవగ్రహ ఆలయాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు.. ఈ తొమ్మిది గ్రహ దేవతలను కలిపి నవగ్రహాలు అంటారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ గ్రహాల ప్రభావం మనిషి జీవితంలోని వివిధ అంశాలపై ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే నవగ్రహ ఆలయాలను దర్శించుకుని గ్రహ దోషాల నుంచి ఉపశమనం పొందాలని, శుభ ఫలితాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, మనశ్శాంతి, కుటుంబ సంతోషం, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం...