STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 5:23 pm Posted by : ARUN

Raja prabhakar: టీఆర్ఎస్‌ నేత రాజ ప్రభాకర్‌ మానవత్వం.. కారు ఆపి రోడ్డు ప్రమాద బాధితులకు అండగా!

టీఆర్ఎస్ కొడంగల్ ఇంఛార్జీ రాజ ప్రభాకర్ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను తక్షణమే ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ పరిధిలో వేగంగా వచ్చిన ఒక ఆటో ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన సమయంలోనే రాజ ప్రభాకర్ అటుగా తన వాహనంలో వెళుతున్నారు. రోడ్డుపై జరిగిన ప్రమాదాన్ని, క్షతగాత్రులను చూసి ఆయన చలించిపోయారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన వాహనాన్ని నిలిపివేసి క్షతగాత్రులకు సాయం అందించారు.

బాధితుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం స్థానికుల సహాయంతో గాయపడిన వారిని తక్షణమే చికిత్స నిమిత్తం పరిగిలోని స్థానిక ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు.