ICC: 2035 వరకు క్రికెట్ షెడ్యూల్ ఖరారు.. 2029 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం
ICC: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2035 వరకు జరిగే పురుషుల క్రికెట్ టోర్నమెంట్ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించిన ఐసీసీ బోర్డు సమావేశాల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2029 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా 2031 వన్డే ప్రపంచకప్‌ను భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అలాగే 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్ సహా మూడు ప్రధాన టోర్నీలకు సంబంధించిన అర్హత విధానాలను కూడా ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ఖరారు చేసిన షెడ్యూల్...