Gold Prices: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే ఎంత తగ్గాయంటే!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చే వార్త. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బలహీనమైన స్పాట్ మార్కెట్ డిమాండ్, మదుపరుల నుంచి అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఈ విలువైన లోహాల ధరలు దిగివచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీకి సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,877 తగ్గింది. దీంతో 1.37 శాతం క్షీణించి రూ.1,34,828 వద్ద ట్రేడయింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించి మొత్తం 15,567 లాట్ల ట్రేడింగ్ నమోదైంది. మార్కెట్‌లో...