Bilkis Bano Case: 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు బెయిల్..సుప్రీం సంచలనం!

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వారి జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం...