BRS:హరీష్ రావు ఇంటికి కేసీఆర్.. కుటుంబ సభ్యులతో భేటీ!
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్... నేడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాసానికి వెళ్లనున్నారు. హరీష్ రావు తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నేరుగా హరీష్ రావు నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని హరీష్ రావు కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడపనున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు...