RAC:రైల్వే ప్రయాణికులకు షాక్.. ఆర్ఏసీ టికెట్ల విధానానికి స్వస్తి?
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే షాక్ ఇచ్చింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్ (RAC) విధానాన్ని పూర్తిగా తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విధానం అమల్లో ఉంటే ఒకే బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు కేటాయిస్తారు. ఇద్దరి దగ్గరా పూర్తి టికెట్ ఛార్జీ వసూలు చేసినప్పటికీ పడుకునేందుకు మాత్రం సగం బెర్త్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యం, టికెట్ ధరలకు అనుగుణంగా వసతి కల్పించాలనే అంశాల నేపథ్యంలో రైల్వేశాఖ ఈ విధానాన్ని పునఃసమీక్షిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది....