Indian Visas: విదేశీయులకు గుడ్న్యూస్.. భారత్ వీసా నిబంధనలు సులభతరం!
భారత్కు వచ్చే విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వీసా దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు ఉన్న 13 ప్రధాన వీసా కేటగిరీలను 9కి తగ్గించింది. అలాగే 49 ఉప కేటగిరీలను 23కి కుదించింది. అంతేకాకుండా వీసా దరఖాస్తు ఫారాల్లో అవసరమైన వివరాలను 65 నుంచి 70 శాతం వరకు తగ్గించింది. విదేశీ పర్యాటకులు, విద్యార్థులు, వైద్య చికిత్స కోసం వచ్చే వారు వ్యాపారవేత్తలకు ఈ మార్పులు ఎంతో ప్రయోజనకరంగా ఉండనున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ...