Telangana: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణకు రావాలని ఆహ్వానం!

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు హాజరుకావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. ముఖ్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రావాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహం, క్రీడారంగ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి ప్రధానితో చర్చించారు. తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది....