China: చైనా సరికొత్త ప్రయోగం.. పైలట్ లేకుండానే ప్రయాణించే ఎలక్ట్రిక్ విమానం!
విమానయాన రంగంలో చైనా మరో కీలక ముందడుగు వేసింది. విద్యుత్ శక్తితో నడిచే అత్యాధునిక విమానాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చైనా ప్రభుత్వ విమాన తయారీ సంస్థ COMAC రూపొందించిన CE-25A ఎలక్ట్రిక్ విమానం ఇప్పటికే ప్రయోగాత్మక పరీక్షల్లో కీలక మైలురాళ్లను చేరుకుంది. ప్రత్యేకత ఏమిటంటే.. ఈ విమానం పైలట్ లేకుండానే స్వయంచాలకంగా ప్రయాణించే సాంకేతికతతో రూపొందించబడింది. సుమారు 10 టన్నుల గరిష్ఠ టేకాఫ్ బరువు కలిగిన ఈ విమానంలో ఒకేసారి 19 మంది ప్రయాణికులు ప్రయాణించేలా రూపకల్పన చేశారు. పూర్తి...