Ardh Kumbh:గంగానది ప్రక్షాళన..బయటపడ్డ 150 టన్నుల చెత్త!
దేశంలో అత్యంత పవిత్రమైన నదిగా భావించే గంగానది ప్రక్షాళనకు అధికారులు భారీ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 2027లో జరగనున్న అర్ధ కుంభమేళా నేపథ్యంలో గంగానది ఘాట్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఏటా నిర్వహించే అప్పర్ గంగా కెనాల్ మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం నదిలో నీటి ప్రవాహాన్ని సుమారు 18 రోజుల పాటు మళ్లించారు. దీంతో నదీ గర్భంలో పేరుకుపోయిన చెత్త బయటపడింది. సుమారు 10 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ శుభ్రత కార్యక్రమంలో 150 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను...