Rahul Gandhi: గిగ్ వర్కర్లకు మద్దతుగా రాహుల్ బైక్ ర్యాలీ..మీ డేటాపై మీకే హక్కు
తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గిగ్ వర్కర్లు తాము చేసే పని, పూర్తి చేసిన రైడ్లు, వాటి ద్వారా పొందే ఆదాయం వంటి వివరాలను తమ మొబైల్ ఫోన్లలోనే తెలుసుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తుందని వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో తెలంగాణ గిగ్ వర్కర్స్ సామాజిక భద్రత, సంక్షేమ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 21వ శతాబ్దం...