టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కళ్యాణ్ రామ్- అనిల్-ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇది మల్టీ స్టారర్ మూవీనా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనిల్ రావిపూడి.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా చిరుతో మనశంకర వరప్రసాద్ గారుతో బ్లాక్ బాస్టర్ అందుకోగా ప్రస్తుతం వెంకీ-కళ్యాణ్ రామ్‌తో కలిసి సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్‌చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో అనిల్ సినిమా అనే వార్త బయటకు రాగానే అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
ఎందుకంటే అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి ఎన్టీఆర్ టైమింగ్, నటన తోడైతే థియేటర్లలో నవ్వుల సందడే.అయితే సినిమా కథ, ఇతర నటీనటులు, నిర్మాణ సంస్థ, షూటింగ్ ప్రారంభం వంటి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.