Etela Rajender: సమస్యలపై రాజీలేని పోరు..వెన్నుచూపని నైజం..జయహో జననేత ఈటల
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జననేత ఈటల రాజేందర్. వామపక్ష భావజాలంతో విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఈటల.... తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రిగా ఆ తర్వాత లెఫ్ట్ నుండి రైట్‌కు(బీజేపీ)లో చేరిక వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఎన్నో సవాళ్లతో కూడుకుంది. ఒకప్పుడు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఈటల.. ఆ తర్వాత అదే కేసీఆర్‌తో రాజకీయంగా ఢీకొట్టే స్థాయికి ఎదిగారు. బీఆర్ఎస్లో కీలక నేతగా, మంత్రిగా కొనసాగారు. రెండోసారి...