STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 1:27 pm Posted by : ARUN

Chiranjeevi: ‘కాక’ ప్రమోషన్ల జాతర షురూ..సంక్రాంతికి దబిడి దిబిడే!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ . చిరు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కాకా సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్రబృందం సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 నుంచి ప్రచార కార్యక్రమాల జాతర ప్రారంభం కానుందని సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా వేదికగా సినిమా ప్రమోషన్లపై కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 1 నుంచి మెగాస్టార్ ప్రమోషన్ల సందడి మొదలవుతుందని, వరుసగా పలు ప్రచార కార్యక్రమాలు, సినిమా అప్‌డేట్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2027 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద గట్టిగా కొట్టబోతున్నామని ఉత్సాహంగా పేర్కొన్నారు. బాస్ మెగాస్టార్ రాంపేజ్ అంటూ ఫైర్ ఎమోజీలతో చేసిన ఆయన పోస్ట్ ప్రస్తుతం అభిమానుల్లో జోష్ నింపుతోంది.

గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుండగా అనురాగ్ కశ్యప్, అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

మొత్తానికి డిసెంబర్ 1 నుంచి కాకా ప్రమోషన్ల హడావుడి మొదలుకానుండటంతో మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.