Matt Henry:హెన్రీ విధ్వంసం.. 89 పరుగులకే కుప్పకూలిన భారత్
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. పేసర్ మాట్ హెన్రీ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఆరు వికెట్లతో సత్తా చాటడంతో భారత్ కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ 244 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో కివీస్ బోణీ కొట్టింది. 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మాట్ హెన్రీ ఆరంభంలోనే కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే...