Cricket Australia: కమిన్స్‌ వర్సెస్ ఖవాజా..మాటల యుద్ధం!

Cricket Australia: 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన శాండ్‌పేపర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఘటనపై మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన జీవిత చరిత్ర ‘సబ్ర్’ (Sabr) పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తీవ్రంగా స్పందించాడు. ఖవాజా చేసిన వ్యాఖ్యలను పచ్చి అబద్ధం , అర్థంపర్థం లేనివి అంటూ కొట్టిపారేశాడు. తన పుస్తకంలో ఖవాజా సంచలన విషయాలను వెల్లడించాడు. శాండ్‌పేపర్ వ్యవహారం...