Whatsapp: వాట్సాప్లో విప్లవాత్మక మార్పులు..ఏఐ ఫీచర్లతో ప్రైవసీకి పూర్తి భద్రత!
Whatsapp: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' తన సేవలను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు వారి విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు ఏఐ సాంకేతికతను తీసుకురానున్నట్లు వాట్సాప్ గ్లోబల్ హెడ్ (సీఈఓ) కునాల్ షా వెల్లడించారు. అదే సమయంలో యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రైవసీలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. మెటా సంస్థ వాట్సాప్ బాధ్యతలను కునాల్ షాకు అప్పగించిన...