Special Parliament Session:మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?

మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ కంటే 15 నుంచి 18 ఓట్లు ఎక్కువగా వస్తాయని కేంద్రం భావిస్తోంది. అయితే ప్రత్యేక సమావేశాల తేదీలు, ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశాలపై ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో 361 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో లోక్‌సభలో 540 మంది...