Mysterious Village: వింత గ్రామం ఇక్కడ మనుషుల ఎత్తు 3 అడుగులే.. ఇళ్ల తలుపులు కూడా అంతే!
ఇరాన్ దేశంలోని ఒక మారుమూల గ్రామం ప్రపంచవ్యాప్తంగా వింత చర్చకు కేంద్రబిందువుగా మారింది. అచ్చం హాలీవుడ్ సినిమా 'గల్లీవర్స్ ట్రావెల్స్' లోని 'లిల్లిపుట్' దేశాన్ని తలపించే ఈ గ్రామంలో నివసించే మనుషుల ఎత్తు కేవలం 3 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇక్కడి ఇళ్ల నిర్మాణాలు, మనుషుల జీవనశైలి చాలా భిన్నంగా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇరాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దు సమీపంలోని సౌత్ ఖోరాసాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ 'మఖునిక్' గ్రామం దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ నివసించే ప్రజల సగటు ఎత్తు...