Jaggareddy: సోనియా బయోపిక్‌పై జగ్గారెడ్డి సంచలనం..కార్యకర్తలే నిర్మాతలు సినిమా తీస్తా!
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జీవిత చరిత్రను తెలుగు వెండితెరపై ఆవిష్కరించేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకం ఆధారంగా తెలుగులో ఒక భారీ సినిమాను నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి ఈ ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీది ఎంతో విజయవంతమైన, స్ఫూర్తిదాయకమైన రాజకీయ జీవితమని...