UPSC Interview: ఒక్క చేత్తో ఏనుగును ఎలా ఎత్తగలరు?..14వ ర్యాంకర్‌కి షాకింగ్ ప్రశ్న!

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో చేరాలని ఎంతోమంది యువత కలలు కంటుంటారు. ఇందుకోసం ఏళ్ల తరబడి కష్టపడి చదువుతూ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. అయితే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో విజయం సాధించినంత మాత్రాన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయిపోలేరు. చివరి దశలో నిర్వహించే పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కూడా ఎంతో కీలకం. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల పరిజ్ఞానంతో పాటు సమయస్ఫూర్తి, ఆలోచనా విధానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ముఖ్యంగా కొన్నిసార్లు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలు అభ్యర్థులను అయోమయానికి...