Andhra pradesh:సర్పంచ్ ఎన్నికలు..ఏకగ్రీవం చేస్తే రూ.కోటిన్నర!

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా మున్సిపల్, ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలతో పోలిస్తే సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు అభ్యర్థులు. అభివృద్ధి పనుల పేరిట అభ్యర్థులు కోట్ల రూపాయలు, విలువైన భూములను గ్రామాలకు రాసిచ్చేందుకు ముందుకొస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా దుళ్ల గ్రామంలో సర్పంచ్ పీఠం కోసం ఏకంగా కోట్లలో బేరసారాలు సాగుతున్నాయి. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.కోటి ఇస్తానని ఒక వ్యక్తి ప్రకటించగా అదే గ్రామానికి చెందిన ఓ...