AI Police Station:దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం..తొలి ఏఐ పోలీస్ స్టేషన్ ఎక్కడో తెలుసా!
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించనుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు వ్యవస్థకు జోడించి, అత్యాధునిక సేవలను అందించేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఇది లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సాంకేతిక మార్పులపై సమీక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు...