X Features:ఎక్స్‌లో కొత్త ఫీచర్..ఇకపై నచ్చిన క్లిప్స్ కట్ చేసి పోస్ట్ చేయొచ్చు!
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) తన వినియోగదారులు, కంటెంట్ క్రియేటర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీడియోల నుంచి నచ్చిన భాగాన్ని కట్ చేసి ప్రత్యేక క్లిప్‌గా పోస్ట్ చేసుకునేలా క్లిప్పింగ్ టూల్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా ఇతరులు రూపొందించిన సుదీర్ఘ వీడియోల్లోని ఆసక్తికరమైన సన్నివేశాలను ఎంపిక చేసుకుని, వాటికి తమ అభిప్రాయాలను జోడించి ఎక్స్‌లోనే షేర్ చేయవచ్చు. ఇప్పటివరకు ఎక్స్‌లోని వీడియోల నుంచి చిన్న క్లిప్స్ తయారు చేయాలంటే వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ఇతర ఎడిటింగ్...