Vijayasai Reddy: సామాజిక న్యాయమే ఎజెండా..‘పరివర్తన రాజనీతి పార్టీ’ ప్రారంభించిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు మాజీఎంపీ విజయసాయి రెడ్డి. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడం, ప్రజల సంక్షేమానికి కృషి చేయడం తమ పార్టీ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరు, ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో ప్రజల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్క నాయకుడి వల్ల రాష్ట్రం లేదా దేశం మారిపోదని...