Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లపై నిషేధం!
Telangana: తెలంగాణలోని విద్యాసంస్థల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో సినిమా ప్రమోషన్లు, ప్రైవేట్, వాణిజ్య కార్యక్రమాల నిర్వహణపై నిషేధం విధించే దిశగా కసరత్తు చేస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలను కేవలం విద్యా సంబంధిత కార్యకలాపాలకే పరిమితం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కాలేజీలు, యూనివర్సిటీల ప్రాంగణాల్లో...