Kavitha: కవిత నివాసంపై డ్రోన్ చక్కర్లు..వీడియో.. బంజారాహిల్స్‌లో కలకలం!

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కలకలం రేగింది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడం ఆందోళనకు దారితీసింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఆమె నివాసంపై డ్రోన్ ఎగురుతుండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో కవిత ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది డ్రోన్ సంచారంపై ఆరా తీశారు. కవిత నివాసం వద్ద డ్రోన్ ఎగరడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది, పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ ఎవరు ఎగురవేశారు? ఏ...