హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కలకలం రేగింది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడం ఆందోళనకు దారితీసింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఆమె నివాసంపై డ్రోన్ ఎగురుతుండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో కవిత ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది డ్రోన్ సంచారంపై ఆరా తీశారు.
కవిత నివాసం వద్ద డ్రోన్ ఎగరడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది, పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ ఎవరు ఎగురవేశారు? ఏ ఉద్దేశంతో కవిత నివాసం వద్ద సంచరించింది? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డ్రోన్ సంచారంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో కవిత నివాసం వద్ద పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన నెలకొంది.
అయితే కవిత నివాసంపై ఎగిరింది పోలీస్ శాఖకు చెందిన డ్రోన్ అని పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై బంజారాహిల్స్ సీఐ సుహాసన్ వివరణ ఇచ్చారు. ప్రముఖుల భద్రత, బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం పోలీస్ శాఖ డ్రోన్లను వినియోగిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే కవిత నివాసం పరిసరాల్లో డ్రోన్ సంచరించినట్లు వివరించారు.
దీంతో తొలుత అనుమానాలకు తావిచ్చిన డ్రోన్ ఘటనపై పోలీసులు స్పష్టత ఇవ్వడంతో పార్టీ శ్రేణులు ఉపిరి పీల్చుకోగా ప్రముఖుల భద్రత కోసం చేపడుతున్న నిఘా చర్యల్లో భాగంగానే డ్రోన్‌ను వినియోగించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
{"type":"video","tracklist":true,"tracknumbers":true,"images":true,"artists":true,"tracks":[{"src":"https://startrinethram.com/wp-content/uploads/2026/11/WhatsApp-Video-2026-11-11-at-11.44.32.mp4","type":"video/mp4","title":"WhatsApp Video 2026-11-11 at 11.44.32","caption":"","description":"","meta":{"length_formatted":"0:31"},"dimensions":{"original":{"width":1024,"height":576},"resized":{"width":674,"height":379}},"image":{"src":"https://startrinethram.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64},"thumb":{"src":"https://startrinethram.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64}}]}