Gujarat Shocker: వేరే కులం యువకుడిని ప్రేమించిందని.. కన్నకూతురిని హత్య చేసిన తండ్రి!

గుజరాత్‌లో పరువు హత్య ఘటన కలకలం రేపింది. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కారణంతో ఓ తండ్రి తన కన్నకూతురినే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీపావళి పండుగ రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలుత కుమార్తె మరణాన్ని సహజ మరణంగా లేదా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ.. పోస్టుమార్టం నివేదికతో అసలు విషయం బయటపడింది. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా ఖంభాట్ తాలూకా మేత్‌పూర్ గ్రామానికి చెందిన కౌశల్‌కుమార్ పటేల్‌కు 21 ఏళ్ల కుమార్తె సాన్యా పటేల్ ఉంది....