AQI:గాలి కాలుష్యంతో అనారోగ్య సమస్యలు.. వైద్యుల హెచ్చరిక!
వాయు కాలుష్యం అంటే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. అయితే కలుషిత గాలి ప్రభావం ఊపిరితిత్తులకే పరిమితం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం పాటు కాలుష్య గాలిని పీల్చడం వల్ల గుండె, మెదడు, మూత్రపిండాలు, కాలేయం, చర్మం, జీర్ణవ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పీఎం 2.5 వంటి సూక్ష్మ కాలుష్య కణాలు శరీరానికి తీవ్ర హాని కలిగిస్తాయని తెలిపారు. ఈ కణాలు వెంట్రుక మందంతో పోలిస్తే దాదాపు 30 రెట్లు చిన్నవిగా ఉంటాయి. అందువల్ల...