STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 12:18 pm Posted by : ARUN

Varanasi:‘వారణాసి’ ప్రీ రిలీజ్ బిజినెస్ సునామీ..ఏకంగా కోట్ల రేంజ్‌లో డీల్!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి . కే.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ సాహస యాత్ర మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా, త్వరలోనే ముగింపు దశకు చేరనుంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ఏకంగా రూ.290 కోట్ల రికార్డు ధరను చెల్లించి సొంతం చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒకవేళ ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌ వస్తే ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది అతిపెద్ద సింగిల్ లాంగ్వేజ్ థియేట్రికల్ డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశముంది. అలాగే ఇతర భాషల మరియు ప్రాంతీయ థియేట్రికల్ హక్కులతో పాటు భారీ డిజిటల్ ఓటీటీ రైట్స్ పై రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నారు.

మొత్తంగా రాజమౌళి విజన్, మహేష్ బాబు గ్లోబల్ అపీల్ కలగలిసి వస్తున్న ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగానే ఈ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న వారణాసి 2027లో థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో వేచి చూడాలి.