Sonia Gandhi: ప్రధాని పదవిపై ఆశలేదు..సోనియా జర్నీ ఆఫ్ లైఫ్‌లో ఆసక్తికర విషయాలు
2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం సాధించడానికి కొన్ని నెలల ముందే సోనియా గాంధీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టాలా? వద్దా? అనే విషయంపై అప్పటికే ఆమె స్పష్టతతో ఉన్నారు. పార్టీ విజయం సాధిస్తే ప్రధాని అవుతారా? అని తన పిల్లలు రాహుల్, ప్రియాంక అడిగినప్పుడు.. “ఖచ్చితంగా వద్దు!” అంటూ తేల్చి చెప్పినట్లు సోనియా వెల్లడించారు. హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురించిన తన ఆత్మకథ ‘Belonging: A Journey of Love’లో సోనియా...