Mahesh Babu: ‘సీన్’ అద్భుతం..తప్పక చూడాల్సిన సినిమా, సూర్య నటనపై మహేశ్ ప్రశంసలు

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్‌’పై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. సినిమా కథనం, దర్శకత్వం, నటీనటుల ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తప్పక చూడాలని ప్రేక్షకులకు సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో ఇన్‌బరాజ్ పాత్రలో సూర్య నటన అద్భుతంగా ఉందని మహేశ్ బాబు పేర్కొన్నారు. నజ్రియా నజీమ్, నస్లెన్ కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారని ప్రశంసించారు. సీన్‌ సినిమాను చూశాను.....