Kavitha:ఓయూకు ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?..నాన్‌ టీచింగ్ ఉద్యోగుల ధర్నాలో కవిత విమర్శలు

ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తామని ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులు ఏమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో ఆమె పాల్గొని సంఘీభావం తెలిపారు. ఏడాదిన్నరగా ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలపై యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు ఖిల్లా అని,...