STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 4:44 pm Posted by : ARUN

BCCI: హార్దిక్-అర్ష్‌దీప్ ట్రేడ్‌కు గ్రీన్‌సిగ్నల్!

BCCI: హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌ల ట్రేడ్ ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే ఇక మిగిలి ఉంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ), అలాగే సంబంధిత ఫ్రాంచైజీల అంతర్గత వర్గాల ప్రకారం, నిబంధనలకు సంబంధించిన అన్ని రకాల అధికారిక అనుమతులు వచ్చాయని ఏ క్షణంలోనైనా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిసింది.

అయితే ఈ ఇద్దరు ఆటగాళ్ల లీగ్ ఫీజుల్లో (జీతాల్లో) ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా రూ. 16.35 కోట్ల జీతం ఎంతైతే ఉందో ఇప్పుడూ అదే కొనసాగనుంది. ఇక 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఆర్టీఎమ్ (RTM) కార్డ్‌ని ఉపయోగించి రూ. 18 కోట్లకు దక్కించుకున్న అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌లో కూడా అదే జీతాన్ని పొందనున్నాడు.

వారం క్రితమే ఈ ట్రేడ్ చర్చలు ప్రారంభమైనప్పటికీ సంబంధిత ఆటగాళ్లు కాగితాలపై సంతకాలు చేయడానికి కాస్త సమయం తీసుకోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైందని తెలుస్తోంది. ఫ్రాంచైజీలతో తదుపరి చర్చల అనంతరం ఆటగాళ్లు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరు ఫ్రాంచైజీలు తమ అంగీకారాన్ని బిసిసిఐకి తెలియజేశాయి.