STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 5:32 pm Posted by : ARUN

Chocolate Recipes: ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే చాక్లెట్ రెసిపీ.. మీకోసమే!

Chocolate Recipes: పిల్లల కోసం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే హెల్తీ అండ్ టేస్టీ చాక్లెట్ రెసిపీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మార్కెట్లో కొనే నాసికరం మిఠాయిలకు బదులుగా పిల్లలతో కలిసి ఇంట్లోనే ఈ హెల్తీ చాక్లెట్లను తయారు చేయించండి. ఖర్జూరం , ఓట్స్, నట్స్, గింజలతో తయారు చేసే రెసిపీలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

()క్రంచీ చాక్లెట్ బైట్స్

డార్క్ లేదా మిల్క్ చాక్లెట్ (150 గ్రాములు), ముర్మూరాలు లేదా కార్న్‌ఫ్లేక్స్ (1 కప్పు), సన్నగా తరిగిన బాదం లేదా కిస్మిస్ (2 టేబుల్ స్పూన్లు)

తయారు చేసే విధానం: ఒక గిన్నెలో చాక్లెట్‌ను కరిగించండి (మైక్రోవేవ్‌లో లేదా వేడి నీటి ఆవిరిపై). అది కొద్దిగా చల్లారిన తర్వాత అందులో ముర్మూరాలు లేదా కార్న్‌ఫ్లేక్స్, బాదం ముక్కలు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మినీ కప్‌కేక్ లైనర్లలో వేసి 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో సెట్ చేయాలి. పైన కలర్ఫుల్ స్ప్రింక్ల్స్ వేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

()డేట్ అండ్ కోకో ట్రఫిల్స్

గింజలు తీసిన మెత్తని ఖర్జూరాలు (10), కోకో పౌడర్ (2 టేబుల్ స్పూన్లు), పొడి చేసిన బాదం లేదా ఓట్స్ (2 టేబుల్ స్పూన్లు), చిటికెడు దాల్చిన చెక్క పొడి.

తయారీ విధానం: ఖర్జూరాలు గట్టిగా ఉంటే పది నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఖర్జూరాలు, కోకో పౌడర్, బాదం పొడి, దాల్చిన చెక్క పొడి వేసి మెత్తని ముద్దలా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టి, ఎండు కొబ్బరి పొడిలో లేదా పిస్తా పొడిలో దొర్లించాలి. 20 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచితే రుచికరమైన ట్రఫిల్స్ సిద్ధం.

() క్రీమీ చాక్లెట్ చియా పుడ్డింగ్

చియా విత్తనాలు (3 టేబుల్ స్పూన్లు), పాలు (1 కప్పు), కోకో పౌడర్ (1.5 టేబుల్ స్పూన్లు), మేపుల్ సిరప్ లేదా తేనె (1-2 టేబుల్ స్పూన్లు), వెనిల్లా ఎసెన్స్ (ఒక చుక్క).

ఒక గిన్నెలో పాలు, చియా విత్తనాలు, కోకో పౌడర్, మేపుల్ సిరప్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. పది నిమిషాల తర్వాత ఉండలు లేకుండా మరోసారి కలిపి, కనీసం రెండు గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచితే పుడ్డింగ్ లాగా చిక్కబడుతుంది. సర్వ్ చేసేటప్పుడు పైన అరటిపండు ముక్కలు, నట్స్ వేయాలి.

()చాక్లెట్ ఓట్స్ లడ్డు

రోల్డ్ ఓట్స్ (1 కప్పు), కోకో పౌడర్ (2 టేబుల్ స్పూన్లు), పీనట్ బటర్ లేదా బాదం బటర్ (3 టేబుల్ స్పూన్లు), తేనె లేదా బెల్లం సిరప్ (3 టేబుల్ స్పూన్లు), అవసరమైతే కొద్దిగా పాలు

తయారీ విధానం: ఓట్స్‌ను మంచి సువాసన వచ్చే వరకు వేయించి, చల్లారిన తర్వాత బరకగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో ఓట్స్ పొడి, కోకో పౌడర్, పీనట్ బటర్, తేనె లేదా బెల్లం సిరప్ వేసి కలపాలి. పొడిగా అనిపిస్తే కొద్దిగా పాలు చల్లుకుని చిన్న లడ్డులుగా చుట్టుకోవాలి. 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచితే గట్టిపడతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈజీగా ఇంట్లోనే పిల్లలతో కలిసి హ్యాపీగా చాక్లెట్ రెసిపీ తయారిని మొదలుపెట్టండి