TRS: తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి రాజ ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ కు విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ లో చేరికల జోష్ కొనసాగుతోంది. తాజాగా కొత్తపల్లి మండలం, భూనిడ్ గ్రామానికి చెందిన పలువురు యువకులు తెలంగాణ రక్షణ సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలోకి చేరిన వారిలో ప్రేమ్, నరేష్, వెంకటేష్, విజయ్ కుమార్ చారి, అజయ్ ఉన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజ ప్రభాకర్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావడం శుభపరిణామమని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు శివశంకర్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.