Tollywood:రాజమౌళి వారణాసికి రామాయణంకు లింక్..మహేష్ పాత్రపై ఇంట్రెస్టింగ్ బజ్!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఇప్పటివరకు పెద్దగా వివరాలు వెల్లడించలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా కథాంశానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం రామాయణంతో సంబంధం కలిగి ఉంటుందని ఇందులో మహేష్ బాబు కాలంలో ప్రయాణించే పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న సమాచారం...