Kangana:బనారసీ లెహంగాలో కంగనా రనౌత్..దీపావళి రాజసం!
పండుగల వేళ ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్స్‌తో పాటు సంప్రదాయ భారతీయ వస్త్రధారణకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ తన దీపావళి లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. బనారసీ శైలిని తలపించే భారీ లెహంగాను ధరించి పాతకాలపు రాజసం ఉట్టిపడేలా కనిపించారు. కంగనా ధరించిన లెహంగా సంప్రదాయ భారతీయ కళానైపుణ్యానికి అద్దం పట్టేలా ఉంది. ఆమె బ్లౌజ్‌ను లేత పింక్, పీచ్, గోల్డ్ రంగుల మేళవింపుతో రూపొందించారు. మెడ భాగం నుంచి చేతుల వరకు పూలు, సంప్రదాయ...