Chandrababu:కుప్పంలో ఒకే ఎంపీటీసీ స్థానంలో ఓడిపోయాం..డబ్బులతో కాదు సేవాభావంతో పాలిటిక్స్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో ఒక ఎంపీటీసీ స్థానంలో తమ పార్టీ ఓటమి పాలైందని ఆ విషయాన్ని అంగీకరించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కక్కుర్తి పడితే ఆ స్థానాన్ని కూడా తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, తప్పుడు విజయాలు ప్రకటించడం తనకు అలవాటు లేదన్నారు. నిజాన్ని నిజంగా చెప్పడమే తన విధానమని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసినప్పుడే ఎన్నికల్లో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని అన్నారు....