Venky Kudumula:డూప్ లేకుండానే అనీష్ యాక్షన్ సీన్లు…వెంకీ కుడుముల ఆసక్తికర వ్యాఖ్యలు!
నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు అర్జున'. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. మహేశ్ ఉప్పాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా గురించి వెంకీ కుడుముల పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మంచి కథతో నిర్మాతగా మారాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. దర్శకుడు మహేశ్ ఉప్పాల చెప్పిన కథ కొత్తగా, ఆసక్తికరంగా అనిపించడంతో ఈ ప్రాజెక్ట్‌తోనే నిర్మాతగా ప్రయాణం ప్రారంభించాలని...