Raja Prabhakar: కొడంగల్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
Raja Prabhakar: వెలుగుల పండుగ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో రాజ ప్రభాకర్ మాట్లాడుతూ.. దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీదేవి కటాక్షం ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రజలందరికీ సిరిసంపదలు, సుఖసంతోషాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో, నిండు ఆయుష్షుతో...