Food Fraud:కల్తీకి కేరాఫ్‌గా భారత్.. మనం తింటున్న ఆహారంలో అసలేం కలుపుతున్నారు?
మనం ప్రతిరోజూ తినే ఆహారం నిజంగా స్వచ్ఛమైనదేనా? మార్కెట్లో కొనుగోలు చేస్తున్న పాలు, పిండి, నెయ్యి, ఇతర ఆహార పదార్థాల్లో ఏమైనా కల్తీ జరుగుతోందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో ఆహార కల్తీ అనేది కేవలం కొంతమంది వ్యాపారులు లాభాల కోసం చేసే చిన్నపాటి మోసంగా మిగలడం లేదు. క్రమబద్ధమైన నెట్‌వర్క్‌ల ద్వారా సాగుతున్న పెద్ద వ్యాపారంగా మారుతోందనే అంశం వెలుగులోకి వచ్చింది. గతంలో పాలలో నీళ్లు కలపడం, నెయ్యిలో ఇతర నూనెలు కలపడం వంటి కల్తీ ఘటనలు ఎక్కువగా వినిపించేవి....