AP Updates:జైలు నుండే జడ్పీటీసీగా వైసీపీ నేత..ఎంపీటీసీగా జర్నలిస్ట్, వివరాలివే

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. పలు స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు విజయాలు సాధించగా, వైఎస్సార్‌సీపీ నామమాత్రపు విజయాలతో సరిపెట్టుకుంది. మరోవైపు కీలక రాజకీయ నేతల కుటుంబ సభ్యులు సైతం ఓటమి పాలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు అనూహ్య విజయాలు సాధించి కూటమికి షాక్ ఇచ్చారు. జైల్లో ఉండి జడ్పీటీసీగా గెలిచిన సత్యనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా పెళ్లకూరు జడ్పీటీసీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హత్యాయత్నం కేసులో...