Andhra Pradesh:ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల్లోనూ కూటమి హవా..వైసీపీ నామమాత్రమే!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ హవా కొనసాగుతోంది.మొన్న మున్సిపల్ ఎన్నికలు తాజాగా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో అధికార కూటమి భారీ విజయాలతో దూసుకుపోయింది. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లా పరిషత్‌లలో 27 స్థానాలను కూటమి కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీ గెలుపొందింది. జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యత మొత్తం 659 జెడ్పీటీసి (ZPTC) స్థానాలకు గాను 77 స్థానాలు ఏకగ్రీవంకాగా మిగిలిన 582 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు ఏకగ్రీవాలతో కలిపి 611 స్థానాలకు ఫలితాలు...