STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 10:26 am Posted by : ARUN

Andhra Pradesh:ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల్లోనూ కూటమి హవా..వైసీపీ నామమాత్రమే!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ హవా కొనసాగుతోంది.మొన్న మున్సిపల్ ఎన్నికలు తాజాగా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో అధికార కూటమి భారీ విజయాలతో దూసుకుపోయింది. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లా పరిషత్‌లలో 27 స్థానాలను కూటమి కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీ గెలుపొందింది.

జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యత

మొత్తం 659 జెడ్పీటీసి (ZPTC) స్థానాలకు గాను 77 స్థానాలు ఏకగ్రీవంకాగా మిగిలిన 582 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు ఏకగ్రీవాలతో కలిపి 611 స్థానాలకు ఫలితాలు వెలువడగా కూటమి మొత్తం 473 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ 384,జనసేన 384,బీజేపీ 19 స్థానాల్లో గెలుపొందిగా వైసీపీ 57 స్థానాల్లో విజయం సాధించింది.

ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 9,821 స్థానాలకు గాను 2,051 స్థానాలు ఏకగ్రీవం కాగా ఇప్పటివరకు 9,640 స్థానాలకు ఫలితాలు ప్రకటించగా, కూటమి అభ్యర్థులు ఏకంగా 5,819 స్థానాలను కైవసం చేసుకున్నారు.టీడీపీ 4,754 స్థానాల్లో జనసేన 945,బీజేపీ 120 స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ 1,583 స్థానాల్లో విజయం సాధించింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచి కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ విజయాల పరంపరను కొనసాగించారు.