White House:వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు..ట్రంప్‌కు గిఫ్ట్‌గా హనుమాన్ చాలీసా
అమెరికాలోని వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారతీయ టెక్ పారిశ్రామికవేత్త, GOQii సంస్థ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు హనుమాన్ చాలీసా ప్రతిని బహూకరించారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో భాగంగా విశాల్ గొండాల్.. అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి సంప్రదాయబద్ధంగా దీపాలను వెలిగించారు. అనంతరం తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా ప్రతిని ఆయనకు అందజేశారు. ఈ విషయాన్ని విశాల్ గొండాల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. ఓవల్ ఆఫీస్‌లో వెలుగులు పంచుకునే...