Priyanka Chopra:ప్రియాంక చోప్రా నటిగా కాదు నిర్మాతగా..క్రేజీ ప్రాజెక్టు!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ మళ్లీ భారతీయ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఆమె ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా భారతీయ చిత్రాలకు దూరంగా ఉంటూ వచ్చిన పలు అవకాశాలను తిరస్కరించిన ప్రియాంక.. చివరకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకు 'వారణాసి' తప్ప మరో భారతీయ సినిమాను ఆమె ప్రకటించలేదు. తాజాగా మరో ప్రాజెక్ట్‌ను వెల్లడించారు. 2016లో విడుదలైన మరాఠీ చిత్రం 'వెంటిలేటర్'కు సీక్వెల్‌గా 'వెంటిలేటర్ 2'ను ప్రకటించారు. ఈ...